sthuthi simhaasanaaseenudaa naa aaraadhanaku paathrudaa స్తుతి సింహాసనాసీనుడా
స్తుతి సింహాసనాసీనుడానా ఆరాధనకు పాత్రుడా (2)నీవేగా నా దైవముయుగయుగాలు నే పాడెదన్ (2) ||స్తుతి||నా వేదనలో నా శోధనలోలోకుల సాయం వ్యర్థమని తలచి (2)నీ కోసమే – నీ కృప కోసమే (2)నీ వెలుగులో నిలిచానయ్యాయేసయ్యా.. నీ ఆత్మతో నింపుమయ్యా (2) ||స్తుతి||నీ సేవలోనే తరియించాలనినీ దరికి ఆత్మలను నడిపించాలని (2)నీ కోసమే – నీ కృప కోసమే (2)నీ సముఖములో నిలిచానయ్యాయేసయ్యా.. నీ శక్తితో నింపుమయ్యా (2) ||స్తుతి||నా ఆశయముతో నా కోరికతోనా గురి నీవని పరుగిడుచుంటిని (2)నీ కోసమే – నీ కృప కోసమే (2)నీ వెలుగులో నిలిచానయ్యాయేసయ్యా.. నీ మహిమతో నింపుమయ్యా (2) ||స్తుతి||