melainaa keedainaa neethone yesayyaa మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా
మేలైనా కీడైనా నీతోనే యేసయ్యాచావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా (2)నేనెల్లప్పుడు యెహోవా నిను సన్నుతించెదను (2)నిత్యము నీ కీర్తి నా నోట నుండును (2) ||మేలైనా||కలిమి చేజారి నను ముంచినాస్థితిని తలక్రిందులే చేసినా (2)రెండింతలుగా దయచేసెదవని (2)నాకు తెలుసునయ్యా మంచి యేసయ్యా (2) ||మేలైనా||పరుల ఎగతాళి శృతి మించినాకలవరము పొంది నే కృంగినా (2)నా మొర విని కృప చూపెదవని (2)నాకు తెలుసునయ్యా మంచి యేసయ్యా (2) ||మేలైనా||శ్రమలు చెలరేగి బెదిరించినాఎముకలకు చేటునే తెచ్చినా (2)ఆపదలలో విడిపించెదవని (2)నాకు తెలుసునయ్యా మంచి యేసయ్యా (2) ||మేలైనా||