• waytochurch.com logo
  • Search and download Christian Lyrics
  • Click to Use Keyboard বাঙালি , हिंदी , ಕನ್ನಡ , മലയാളം , தமிழ் , తెలుగు
  • Shilanaina Nannu Shilpivai Maarchaavu శిలనైన నన్ను శిల్పివై మార్చావు Lyrics videoSong no:12522 -

    Shilanaina Nannu Shilpivai Maarchaavu శిలనైన నన్ను శిల్పివై మార్చావు

    Click to View in বাঙালি | English | ગુજરાતી | हिंदी | ಕನ್ನಡ | മലയാളം | Oriya | ਪੰਜਾਬੀ | தமிழ் | తెలుగు |

    శిలనైన నన్ను శిల్పివై మార్చావు
    నాలోని ఆశలు విస్తరింపచేసావు (2)
    నీ ప్రేమ నాపై కుమ్మరించుచున్నావు (2)
    నీ ప్రేమే నా ఊపిరి – నీ ప్రేమే నా కాపరి (2) ||శిలనైన||

    మోడుబారిన నా జీవితం
    నీ ప్రేమతోనే చిగురింపచేసావు (2)
    నీ ప్రేమాభిషేకం నా జీవిత గమ్యం (2)
    వర్ణించలేను లెక్కించలేను (2)
    నీ ప్రేమే నా ఊపిరి – నీ ప్రేమే నా కాపరి (2) ||శిలనైన||

    ఏ విలువలేని అభాగ్యుడను నేను
    నీ ప్రేమచూపి విలువనిచ్చి కొన్నావు (2)
    నాయెడల నీకున్న తలంపులు విస్తారం (2)
    నీ కొరకే నేను జీవింతు ఇలలో (2)
    నీ ప్రేమే నా ఊపిరి – నీ ప్రేమే నా కాపరి (2) ||శిలనైన||

    ఊహించలేను నీ ప్రేమ మధురం
    నా ప్రేమ మూర్తి నీకే నా వందనం (2)
    నీ ప్రేమే నాకాధారం – నా జీవిత లక్ష్యం (2)
    నీ ప్రేమే నా ఊపిరి – నీ ప్రేమే నా కాపరి (2) ||శిలనైన||

    Language:Telugu | 94 | Write Comment
  • Post new Lyric | See Tips | Latest | Top Views | Songs List | mostviewed | Total Hits: 3426283
  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2017 Waytochurch.com