• Search and download Christian Lyrics
  • sri yesundu janminche reyilo శ్రీ యేసుండు జన్మించె రేయిలో ||2|| Lyrics videoSong no:177 -

    sri yesundu janminche reyilo శ్రీ యేసుండు జన్మించె రేయిలో ||2||

    Click to View in বাঙালি | English | ગુજરાતી | हिंदी | ಕನ್ನಡ | മലയാളം | Oriya | ਪੰਜਾਬੀ | தமிழ் | తెలుగు |

    శ్రీ యేసుండు జన్మించె రేయిలో ||2||
    నేడు పాయక బెత్లెహేము ఊరిలో ||2|| ||శ్రీ యేసుండు||

    ఆ కన్నియ మరియమ్మ గర్భమందున ||2||
    ఇమ్మానుయేలనెడి నామమందున ||2|| ||శ్రీ యేసుండు||

    సత్రమందున పశువులశాల యందున ||2||
    దేవపుత్రుండు మనుజుండాయెనందునా ||2|| ||శ్రీ యేసుండు||

    పట్టి పొత్తి గుడ్డలతో చుట్టబడి ||2||
    పశుల తొట్టిలో పరుండ బెట్టబడి ||2|| ||శ్రీ యేసుండు||

    గొల్లలెల్లరు మిగుల భీతిల్లగా ||2||
    దెల్పె గొప్ప వార్త దూత చల్లగా ||2|| ||శ్రీ యేసుండు||

    మన కొరకొక్క శిశువు పుట్టెను ||2||
    ధరను మన దోషములబోగొట్టెను ||2|| ||శ్రీ యేసుండు||

    పరలోకపు సైన్యంబు గూడెను ||2||
    మింట వర రక్షకుని గూర్చి పాడెను ||2|| ||శ్రీ యేసుండు||

    అక్షయుండగు యేసు పుట్టెను ||2||
    మనకు రక్షణంబు సిద్ధపరచెను ||2|| ||శ్రీ యేసుండు||

    Language:Telugu | 1273 | Write Comment
  • Post new Lyric | See Tips | Latest | Top Views | Lyrics List | mostviewed | Total Hits: 1733412

© 2017 Waytochurch.com