aahaa yemaanandam aahaa yemaanandamu ఆహా యేమానందం ఆహా యేమానందము
ఆహా యేమానందం ఆహా యేమానందము చెప్ప శక్యమా (2)ఆహా మా రాజగు యేసు మా వృజినముల మన్నించి వేసెను (2) ||ఆహా||ముదముతో నాడుచు కూడుచు పాడుచు ఆర్భాటించెదము (2)వెదకుచు వచ్చిన యేసును హృదయాన కోరి స్తుతింతుము (2) ||ఆహా||అక్షయుడగు ప్రేమతో రక్షణ బాకాను గ్రహించినందున (2)రక్షకుడు యేసును గూర్చి మా సాక్ష్యము నిశ్చయముగా నిత్తుము (2) ||ఆహా||తెల్లంగి వాద్యము స్వర్ణ కిరీటము మేడపై జయ జెండాల్ (2)ఉల్లాసించి మంటి నుండి మింట కేగిన రాజున్ స్తుతింతుము (2) ||ఆహా||