o maanavaa nijamedo erugavaa ఓ మానవా నిజమేదో ఎరుగవా
ఓ మానవా.. నిజమేదో ఎరుగవా ఓ మానవా.. ఇకనైనా మారవాఈ దినమే అనుకూలం…లేదిక వేరే ఏ సమయం నిజమేదో తెలియకనే చనిపోతే నీ గతి ఏమి? (2) ||ఓ మానవా||సిలువను గూర్చిన శుభ వార్త వెర్రితనముగా ఉన్నాదా?దేవుని శక్తని తెలుసుకొని ప్రభు మార్గమును చేరెదవా? (2) ||ఈ దినమే||ప్రయాసముతో భారము మోసే నిన్నే దేవుడు పిలిచెనుగా ప్రయత్నము వీడి విశ్రాంతిని పొంద వేగిరమే పరుగిడి రావా (2) ||ఈ దినమే||నీ ధనము నీ ఘనము నీ సర్వస్వము చితి వరకే అర్పించుము నీ హృదయమును రక్షకుడైన ప్రభు కొరకే (2) ||ఈ దినమే||