praardhanalu aalakinchu deva ప్రార్ధనలు ఆలకించు దేవా
[VERSE 1]
ప్రార్ధనలు ఆలకించు దేవా
మొరలన్ని వినువాడా
నా పక్షమున పోరాడే దేవా
జయమిచ్చి నడుపువాడా
[CHORUS]
నా దేవా నా దేవా
ధ్వజమై నడుపువాడా
నా దేవా నా దేవా
విడుదల నొసగువాడా
[VERSE 2]
అలల్లెన్నో లేచినను
అగ్నిలో నడచినను
నీ కృపలో నను కాచితివి
అద్భుతముగ మార్చితివి
[BRIDGE]
మంచివాడా ఓ… మహోన్నతుడా
మహిమాన్వితుడా మంచి చేయువాడా
సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా
నా దేవా నా దేవా