• waytochurch.com logo
Song # 2696

visukadhae praanmbu vijnyaani విసుకదే ప్రాణంబు విజ్ఞాని కిలన


Chords: ragam: శుద్ధకాంభోజి-shudhDhakaaMbhoaji

విసుకదే ప్రాణంబు విజ్ఞాని కిలను పొసగు వైరాగ్యంబు పుట్టదే
తలను అసదు గానట్టి కష్టానుభవమే గాని యసదృశానంద ఫల
మొసగుఁ నది యేది ||విసుకదే||

1. మును పేది యుండెనో వెనుక నదియే యుండు మునుపు వెనుకకు
మధ్య మున నున్న దదియే నొనరంగఁ గ్రొత్తయై యుత్పన్నమగు నట్టి
ఘనకార్య మొక్కటియుఁ గానంగరాదు ||విసుకదే||


2. ధరణి మీఁదికి దిగం బరుఁబగుచు నేతించు మరణ మప్పుడు దిగం
బరుఁడగుచుఁ బోవున్ నర్రుడు పుట్టినఁడు సరెకెద్దియును తేఁడు
మరణమగు నాఁడొక్క సరకుగొనిపోఁడు ||విసుకదే||


3. ఒక తరము పోవు మరియొక తరము జనుదెంచు సకల వంశము లిట్లు
సమసిపోవుచుండు నిఁక వారి పేర్పింపు లెచ్చోట నేమాయె నొకండైన
చెప్పుటకు నుర్విలో లేఁడు ||విసుకదే||


4. ఏటివంకలు దీర్చ నెవ్వాని కలవి ము న్నీటి మూఁకుడు సేయ
నేర్పరి యెవండు మోటైన మనసు వం పులు దీర్చు గురు వెవఁడు కోటి
ధనమిచ్చినను కుంభినిని లేఁడు ||విసుకదే||


5. ధరణిలో నరరూపు దాల్చి పాపుల కొఱకు మరణమై లేచు స ద్గురు
డైన యేసు చరణాబ్జముల సేవ సారమిది యొక్కటే పరమ ఫలమిడు
సుఖ ప్రాప్తి యొనరించున్ ||విసుకదే||

visukadhae praaNMbu vijnYaani kilanu posagu vairaagyMbu puttadhae
thalanu asadhu gaanatti kaShtaanubhavamae gaani yasadhrushaanMdha phla
mosaguAO nadhi yaedhi ||visukadhae||

1. munu paedhi yuMdenoa venuka nadhiyae yuMdu munupu venukaku
maDhya muna nunna dhadhiyae nonarMgAO groththayai yuthpannamagu natti
ghanakaarya mokkatiyuAO gaanMgaraadhu ||visukadhae||


2. DharaNi meeAOdhiki dhigM baruAObaguchu naethiMchu maraNa mappudu dhigM
baruAOdaguchuAO boavun narrudu puttinAOdu sarekedhdhiyunu thaeAOdu
maraNamagu naaAOdokka sarakugonipoaAOdu ||visukadhae||


3. oka tharamu poavu mariyoka tharamu janudheMchu sakala vMshamu litlu
samasipoavuchuMdu niAOka vaari paerpiMpu lechchoata naemaaye nokMdaina
chepputaku nurviloa laeAOdu ||visukadhae||


4. aetivMkalu dheercha nevvaani kalavi mu nneeti mooAOkudu saeya
naerpari yevMdu moataina manasu vM pulu dheerchu guru vevAOdu koati
Dhanamichchinanu kuMbhinini laeAOdu ||visukadhae||


5. DharaNiloa nararoopu dhaalchi paapula koRaku maraNamai laechu sa dhguru
daina yaesu charaNaabjamula saeva saaramidhi yokkatae parama phlamidu
sukha praapthi yonariMchun ||visukadhae||

Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com