• waytochurch.com logo
 • Search and download Christian Lyrics
  • Song no:2700

   manasaanmdhamuao bomdhuta kann-మనసానందముఁ బొందుట కన్నను మరి య

  Chords: ragam: సౌరాష్ట్ర-sauraaShtr

  మనసానందముఁ బొందుట కన్నను మరి యే భాగ్యము గల దన్న అనుమానము లిఁక సఖిల సుఖంబులు దిన మొక గడికొక తీరై యుండును ||మన||

  1. దిటముగఁ ప్రార్థన యను ఖడ్గముఁ గని తిరుగు పిశాచము వెఱ చన్న పటుదీప్తులు గల ప్రభు శాస్త్రోక్తులు బహు సంశయ పం కము నింకించును ||మన||

  2. సాధు జనోత్తమ క్రైస్తవ సంగతి సమకూడిన మేలౌ నన్న శోధన లన్నిటి స్థిరముగ నోర్చెడి శుభమతి కన్నను సుఖమే మున్నది ||మన||

  3. తనువున దానను వానికి దురితము దగిలెడు విధిఁ గనవలె నన్న యొనర గ క్రీస్తుని వధ్యాస్తంభముఁ గని విశ్వాసముఁ గట్టిగఁ బెంచిన ||మన||

  4. క్షమయును స్నేహము ప్రభుకడ నేర్చిన శత్రువు లిఁక భువి లేరన్న సమదృష్టి జగ జ్జనుల గనుంగొను సత్క్రైస్తవులకు సాధన మనఁ దగు ||మన||

  5. పరమదయానిధి క్రీస్తుని బలమునఁ బాప భరంబులు విడు నన్న పరిశుద్ధాత్ముని బంధుత్వంబున అరమర చీఁకటు లన్నియుఁ దొలఁ గును ||మన||

  Language:TELUGU | Author:పురుషోత్తము చౌదరి | Album:Andhra Kristava Keerthanalu | Category :మనశ్శాంతియే మహా భాగ్యము | 810 | Write Comment
 • Post new Lyric | See Tips | Latest | Top Views | Songs List | mostviewed | Total Hits: 4646340
 • title
 • Name :
 • E-mail :
 • Type

© 2018 Waytochurch.com