• waytochurch.com logo
  • Search and download Christian Lyrics
  • Click to Use Keyboard বাঙালি , हिंदी , ಕನ್ನಡ , മലയാളം , தமிழ் , తెలుగు
  • brathakaalani unnaa brathakalekunnaa బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా Lyrics videoSong no:271 -

    brathakaalani unnaa brathakalekunnaa బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా

    Click to View in বাঙালি | English | ગુજરાતી | हिंदी | ಕನ್ನಡ | മലയാളം | Oriya | ਪੰਜਾਬੀ | தமிழ் | తెలుగు |

    బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా
    నిలవాలని ఉన్నా నిలవలేకున్నా ||2||
    చూడాలని ఉన్నా చూడలేకున్నా
    చేరాలని ఉన్నా నిను చేరలేకున్నా
    బ్రతికించుమో యేసయ్యా
    దరి చేర్చుమో నన్నయ్యా ||2|| ||బ్రతకాలని||

    కాపరి లేని గొర్రెనైతి
    కాటికి నే చేరువైతి
    కావలి లేని తోటనైతి
    కారడవిగా నే మారితి
    గూడు చెదరిన గువ్వనైతి
    గుండె పగిలిన ఎకాకినైతి
    గుండె దిగులుగా ఉందయ్యా
    గూడు చేర్చుమో యేసయ్యా ||2|| ||బ్రతకాలని||

    నా ఆశలే అడియాశలై
    అడుగంటెనే నా జీవితం
    శోధనల సుడివడిలో
    తొట్రిల్లెనే నా పయనం
    చుక్కాని లేని నావనైతి
    గమ్యం తెలియక అల్లాడుచుంటి
    గురి చేర్చుమో యేసయ్యా
    గుండె గుడిలో నీవుండయ్యా ||2|| ||బ్రతకాలని||

    Language:Telugu | 1145 | Write Comment
  • Post new Lyric | See Tips | Latest | Top Views | Songs List | mostviewed | Total Hits: 3627808
  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2017 Waytochurch.com