• waytochurch.com logo
  • Search and download Christian Lyrics
  • Song no:2823

    yehoavayae naa mahaadhaevuaoda-యెహోవయే నా మహాదేవుఁడని బహుగ నె

    Chords: ragam: గౌళిపంతు-gauLipMthu

    యెహోవయే నా మహాదేవుఁడని బహుగ నెఱిఁగి మన నావంతు సహదాసులతో మహి నొకఁడనని సహాయ మిడుటే నీవంతు ||యెహోవా||

    1. మితిమిఱిన దు రిత సమూహముల క్షత మొనర్ప మన నావంతు పతితపావనుని క్షతజనములో నను నుతికి కడుగుటె నీవంతు ||యెహోవా||

    2. ప్రతిదిన బ్రతుకును మతి నుంచుచు నిను స్తుతి యొనర్చుటే నావంతు క్షితినేఁబడుదు ర్వెతల నుండ శా శ్వతముఁ బ్రోచుటె నీవంతు ||యెహోవా||

    3. చంచల మతిఁదొల గించుమంచుఁ బ్రా ర్థించుచుండుటే నావంతు అంచి తాత్మనిఁకఁ బంచి స్ధిరతను బెంచుచుండుటే నీవంతు ||యెహోవా||

    4. యేసు సిలువలో నే సంధించి గాసి సహించుట నావంతు భాసురమోక్ష ని వాసమునకు నను దీసుకపోవుటే నీవంతు ||యెహోవా||

    5. మేటి వార్త నా బోటి జనాళికి ఁ జాటించుటయే నావంతు చాటిన దానిని గాటముగ మది నాటించుటయే నీవంతు ||యెహోవా||

    6. అనుదిన మబలుఁడ నని మదినిం గనుఁ గొని బ్రదుకుటయే నా వంతు ననుఁ బదాబ్జప జ్జనుఁ జేర్చియు బల మును గృప నిచ్చుటే నీవంతు ||యెహోవా||

    7. ముదముతోడ నీ తుదిరాక కొఱకు నెదురు చూచుటే నావంతు సదమలాత్మచే హృదయమును సదా పదిలపఱచునటే నీవంతు ||యెహోవా||

    Language:TELUGU | Author:జుటికె దావీదు | Album:Andhra Kristava Keerthanalu | Category :దేవుని పనియు, మనుష్యుని పనియు | 885 | Write Comment
  • Post new Lyric | See Tips | Latest | Top Views | Songs List | mostviewed | Total Hits: 4983572
  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2018 Waytochurch.com