• Search and download Christian Lyrics
  • Song no:2875 -

    aasheervaadhamu neeyuma maa pa-ఆశీర్వాదము నీయుమ మా పరమజనక యాశ

    Chords: ragam: కమాసు-kamaasu
    Click to View in বাঙালি | English | ગુજરાતી | हिंदी | ಕನ್ನಡ | മലയാളം | Oriya | ਪੰਜਾਬੀ | தமிழ் | తెలుగు |

    ఆశీర్వాదము నీయుమ మా పరమజనక యాశీర్వాదము నీయుమ ఆశలుదీరంగ నాయు వొసంగుచు వాసిగ కరుణను వర్ధిల్ల బిడ్డకు ||ఆశీర్వాదము||

    1. యేసు పెరిగిన యట్టులే నీ దయయందు ఈసు బిడ్డను పెంచుము వాసిగ మనుజుల కరుణయందున బెరుగ భాసుర వరమిచ్చి బాగుగ బెంచుము ||ఆశీర్వాదము||

    2. నెనరు మీరగ మోషేను నెమ్మదియందు తనర బెంచినట్లుగ ఘనముగ నీ శాంతి సంతసములయందు తనర నీ బిడ్డను తగురీతి బెంచుము ||ఆశీర్వాదము||

    3. ఏ రీతి సమూయేలును నీ సన్నిధిలో నేపుగ బెంచితివో యారీతి నీ బిడ్డ నాత్మ స్నేహమునందు కోరి బెంచుము ప్రభువ కోర్కెలూరగ వేగ ||ఆశీర్వాదము||

    4. సత్య విశ్వాసమునందు చక్కగ బెరుగ శక్తి యొసంగినడ్పుమా సత్య వాక్యమునందు సరగను వర్ధిల్ల నిత్యము నీ కృప నిచ్చి బ్రోవుమ ప్రభువ ||ఆశీర్వాదము||

    5. భక్తి ప్రేమల నీ బిడ్డ బాగుగా బెరుగ శక్తినీయ మా ప్రభువ ముక్తి పథంబున ముద్దుగ నడువంగ యుక్తజ్ఞానము నిచ్చి యుద్ధరించుమ ప్రభువ ||ఆశీర్వాదము||

    Language:TELUGU | Author:తూలూరి ప్రకాశము | Album:Andhra Kristava Keerthanalu | Category :బాలల జన్మ దినోత్సవము | 393 | Write Comment
  • Post new Lyric | See Tips | Latest | Top Views | Lyrics List | mostviewed | Total Hits: 1726955

© 2017 Waytochurch.com