naadhu jeevamaayanae naa samasనాదు జీవమాయనే నా సమస్తము నా స
నాదు జీవమాయనే నా సమస్తము
నా సర్వస్వము యేసుకే నాదు జీవము
నాదు దైవము దివి దివ్య తేజము
1. కృంగినవేళ భంగపడినవేళ అద్దరికి చేర్చెను
చుక్కానిలేని నావవలె నేనుండ అద్దరికి చేర్చెను
ఆత్మతో నింపెను ఆలోచన చేసెను ||నాదు||
2. సాతాను ఖైదీనై కుములుచున్న వేళ
విడిపించే శ్రీ యేసుడే రక్తమంత కార్చి
ప్రాణాన్ని బలిచేసి విమోచన దయచేసెను
సాతానుని అణగద్రొక్క అధికార బలమిచ్చెను ||నాదు||
3. కారుమేఘాలే క్రమ్మినవేళ నీతిసూర్చుడు నడుపును
తుఫానులెన్నో చెలరేగి లేచిన నడుపును నా జీవితనావ
త్వరలో దిగివచ్చును తరలిపోదుము ప్రభునితో ||నాదు||