• waytochurch.com logo
  • Search and download Christian Lyrics
    • Song no:2960

      yaesukreesthu prabhuvaa maemu -యేసుక్రీస్తు ప్రభువా మేము నీ మ

    Chords: ragam: ముఖారి-mukhaari

    యేసుక్రీస్తు ప్రభువా మేము నీ మోక్షముఁ బొందుటకు దోసపు లోకము లోనికి వచ్చితి దోషులఁ బ్రోచుటకు ||యేసు||

    1. పరిశుద్ధుఁడ వీవు ఇలలో పాపుల నందరిని పరిపరివిధ కృప వాక్కులతోడను పిలిచితి వెల్లప్పుడు ||యేసు||

    2. సత్యపు నడతలతో జగతిని సర్వాద్భుతములను నిత్యముఁ జేయుచు నీ కృప చాల యిలలోఁ దెల్పితివే ||యేసు||

    3. అతి పుణ్యాత్ముఁడవే క్షితిలో వెతలను బొందితివే మృతిని బొందియు మూఁడవ దినమున బ్రతికియు లేచితివే ||యేసు||

    4. పాపుల మని తెలిసి నీదగు దాపున జేరఁగనే పాపముఁ బాపుచు ప్రాపుగ నుండెడి ప్రభుఁడవు నీవెగదా ||యేసు||

    5. దురిత వితతి దూరా నమ్మిన దురితుల స్నేహితుఁడా నిరతము మమ్మును నీ కృప లోపల నిలకడగాఁ బెంచు ||యేసు||

    6. నోరు నిండ నెదలో నీ కృప ప్రేరేపణఁగలిగి సారెకు వేఁడెద ముర్వికి రక్షణ కారకుఁడా నిన్ను ||యేసు||

    Language:TELUGU | Author:గొల్లవల్లి నతానియేలు | Album:Andhra Kristava Keerthanalu | Category :క్రీస్తుని దయ | 927 | Write Comment
  • Post new Lyric | See Tips | Latest | Top Views | Songs List | mostviewed | Total Hits: 4679148
  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2018 Waytochurch.com