• waytochurch.com logo
Song # 2986

aa ymdhakaarmpu raeyiloa kreesఆ యంధకారంపు రేయిలో క్రీస్తు పడ


Chords: ragam: అసావేరి-asaavaeri

ఆ యంధకారంపు రేయిలో క్రీస్తు పడు నాయాసములు దలఁచరే
సాయంతనము శిష్య నమితితో భోజనముఁ జయఁగూర్చున్న ప్రభువు
భక్తుల కనియె ||నా యంధ||

1. ఒకఁడు మీలో నన్ను యూద గణముల చేత లకు నప్పగింపఁ దలఁ
చెన్ మొక మిచ్చకము గల్గు మూర్ఖుఁడగు యూదాను మొనసె
వీడనుచుఁ దెలిపి యికఁ మిమ్ముఁగూడియుం డకయుందునని రొట్టె
విరిచి స్తోత్రంబుజేసి ప్రకటంబుగా దీని భక్షించుఁడని పిదప నొక పాత్ర
నాన నిచ్చెన్ ద్రాక్షారసం ||బా యంధ||


2. తన మేని గురుతు రొ ట్టెను జేసి పాపవిమో చనమైన రక్తమునకు
నొనరంగ ద్రాక్షారస మును గురుతుగాఁ దెలిపి నెనరుగల కర్త యపుడు
చనె గెత్సెమను వన స్థలిలోన శిష్యుల నునిచి తానొక్కరుండు
మనసు వ్యాకులము చే తను నిండియుండఁగా ఘనుడు ప్రార్ధించెఁదండ్రిన్
గాఢముగాను ||ఆ యంధ||


3. శ్రమచేతఁ దన శరీ రము నుండి దిగజారెఁ జెమట రక్తపు బొట్లుగా
నమితమౌ లోకపా పముఁ జూచి నిట్టూర్పులప్పటప్పటికిఁ బుచ్చి
క్రమముగా దూత తన కడ కరుగుదెంచి శాం తముఁ బల్కి చనిన
పిదపం తమ మనంబులఁ బోలు తమసమున యూద సై న్యము
లేగుదెంచె నపుడు గెత్సెమను పనికి ||నా యంధ||


4. పరశాంతి శీల స ర్వజ్ఞతలు గల ప్రభుం డెరిఁగి తనకున్న పాట్లు
పరిపంధి గణముతోఁ బలికె మీరిచ్చోట నరయుచున్నా రెవనిని
నరులు నజరేతు యే సను వాని ననఁగఁ దా నెఱిఁగించె నేనేయని
గురుదీప శిఖల సో కు పతంగముల భంగి ధరణిపైఁ బడిరి వారల్
దర్పము లణఁగి ||యా యంధ||


5. తన శిష్యులను విడువుఁ డని రిపులచేఁ దానె పట్టువడియెన్ కినిపి
పేతురు యాజ కుని దాసు కర్ణంబు దునుమంగ క్రీస్తుఁడపుడు
కనికరంబున స్వస్థ తను జేయు నావిభుని కరములను విరిచి కట్టి
వెనుక ముందరఁ జుట్టు కొని యెరూషలేము పుర మునకుఁ దీనుకఁ
బోయిరి రాణువవార ||లా యంధ||

aa yMDhakaarMpu raeyiloa kreesthu padu naayaasamulu dhalAOcharae
saayMthanamu shiShya namithithoa bhoajanamuAO jayAOgoorchunna prabhuvu
bhakthula kaniye ||naa yMDha||

1. okAOdu meeloa nannu yoodha gaNamula chaetha laku nappagiMpAO dhalAO
chen moka michchakamu galgu moorkhuAOdagu yoodhaanu monase
veedanuchuAO dhelipi yikAO mimmuAOgoodiyuM dakayuMdhunani rotte
virichi sthoathrMbujaesi prakatMbugaa dheeni bhakShiMchuAOdani pidhapa noka paathra
naana nichchen dhraakShaarasM ||baa yMDha||


2. thana maeni guruthu ro ttenu jaesi paapavimoa chanamaina rakthamunaku
nonarMga dhraakShaarasa munu guruthugaaAO dhelipi nenarugala kartha yapudu
chane gethsemanu vana sThaliloana shiShyula nunichi thaanokkaruMdu
manasu vyaakulamu chae thanu niMdiyuMdAOgaa ghanudu praarDhiMcheAOdhMdrin
gaaDamugaanu ||aa yMDha||


3. shramachaethAO dhana sharee ramu nuMdi dhigajaareAO jemata rakthapu botlugaa
namithamau loakapaa pamuAO joochi nittoorpulappatappatikiAO buchchi
kramamugaa dhootha thana kada karugudheMchi shaaM thamuAO balki chanina
pidhapM thama manMbulAO boalu thamasamuna yoodha sai nyamu
laegudheMche napudu gethsemanu paniki ||naa yMDha||


4. parashaaMthi sheela sa rvajnYthalu gala prabhuM deriAOgi thanakunna paatlu
paripMDhi gaNamuthoaAO balike meerichchoata narayuchunnaa revanini
narulu najaraethu yae sanu vaani nanAOgAO dhaa neRiAOgiMche naenaeyani
gurudheepa shikhala soa ku pathMgamula bhMgi DharaNipaiAO badiri vaaral
dharpamu laNAOgi ||yaa yMDha||


5. thana shiShyulanu viduvuAO dani ripulachaeAO dhaane pattuvadiyen kinipi
paethuru yaaja kuni dhaasu karNMbu dhunumMga kreesthuAOdapudu
kanikarMbuna svasTha thanu jaeyu naavibhuni karamulanu virichi katti
venuka muMdharAO juttu koni yerooShlaemu pura munakuAO dheenukAO
boayiri raaNuvavaara ||laa yMDha||

Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com