dhaevaathma jayoa dheenadhayaaదేవాత్మ జయో దీనదయాళూ పావనాత్మ
Chords: ragam: మాయామాళవగౌళ-maayaamaaLavagauL
దేవాత్మ జయో దీనదయాళూ పావనాత్మ మము బ్రోచితహో నీవే గదా
మా నిజరక్షణకై జీవమీయ ధర జేరితహో||
1. సుగుణాత్ములలో సుగుణము నీవే నిగమము లెరుగని నీతివహో
సుజనాత్ముల కిల సుజ్ఞానాత్మవు సవినయ భక్తికి సారమహో||
2. పేదలలో నిరు పేదవు నీవే సాధులలో ఘన సాధువహో మోదమలర
మా ముక్తిని గూర్చిన సాధు పేదజన సోదరహో||
3. దీనాత్ములలో దీనుడవై భవదీయ దయారస ధారలహో దినదిన
మొసగిన దేవాత్మజ యిమ్మాను యేలు వం దనములహో||
4. పరమ పూజ్యుడా పరిమిత ప్రేమాభరితుడ సంస్థవ పాత్రుడహో
నిరతము నిన్నేమరక నుతిం చెద నరజన గణముల నేస్తడహో||