• waytochurch.com logo
  • Search and download Christian Lyrics
    • Song no:3072

      aalimchu maa praarthana maa ra-ఆలించు మా ప్రార్థన మా రక్షకా య

    Chords: ragam: కమాసు-kamaasu

    ఆలించు మా ప్రార్థన మా రక్షకా యాలించు మా ప్రార్థన నాలింతు వని నమ్మి యాసక్తి వేఁడెదము మేలైన దీవెనలు మెండుగాఁ గురిపించి ||యాలించు||

    1. ఈ సదన మర్పింతుము మా ప్రియ జనక నీ సుతుని దివ్యాఖ్యను నీ సేవకై మేము నెనరుచే నొసఁగు ని వాసము గైకొని వర కరుణచే నిప్పు ||డాలించు||

    2. ఇందుఁ గూడెడు భక్తుల డెందము లనెడు మందిరంబుల నాత్మచే పొందుగ నివసించి పూర్ణుఁడ వగు దేవ యంద మైన సుగుణ బృందంబుతో నింపి ||యాలించు||

    3. ఇచ్చట శుభవార్తను విచ్చల విడిగ వచ్చి వినెడు పాపులఁ జెచ్చెర రక్షించి యిచ్చి శుద్ధాత్మను సచ్చరిత్రులఁ జేసి సాంద్ర మగు కరుణచే ||నాలించు||

    4. నభము నేలెడి తండ్రి యిచ్చోటను శుభవార్త బోధించెడు ప్రభు యేసు సేవకులు సభకు మాదిరు లగుచు సభ వృద్ధి నొందింప శక్తి వారల కిచ్చి ||యాలించు||

    5. చుట్టు నుండెడు నూళ్లలో శుభ వాక్యంబు దిట్టముగఁ బ్రకటింపఁ గఁ పట్టు గల్గెడివారి బంపి యిచ్చటనుండి దట్టమగు నీ ప్రేమఁ దగినట్లు తెలిపించి ||యాలించు||

    Language:TELUGU | Author:పులిపాక జగన్నాధము | Album:Andhra Kristava Keerthanalu | Category :మందిరార్పణము | 1023 | Write Comment
  • Post new Lyric | See Tips | Latest | Top Views | Songs List | mostviewed | Total Hits: 4642310
  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2018 Waytochurch.com