• waytochurch.com logo
  • Search and download Christian Lyrics
  • Click to Use Keyboard বাঙালি , हिंदी , ಕನ್ನಡ , മലയാളം , தமிழ் , తెలుగు
  • Song no:3182 -

    kumaari aalakimchu nee vaaloachimchi-కుమారి ఆలకించు నీ వాలోచించి

    Click to View in বাঙালি | English | ગુજરાતી | हिंदी | ಕನ್ನಡ | മലയാളം | Oriya | ਪੰਜਾਬੀ | தமிழ் | తెలుగు |


    Reference: ఈ రాజు నీ ప్రభువు. అతడు నీ సౌందర్యమును కోరినవాడు. అతనికి నమస్కరించుము. కీర్తన Psalm 45:10-17

    పల్లవి: కుమారి ఆలకించు - నీ వాలోచించి
    కుమారి చెవియొగ్గుము

    అను పల్లవి: మరువుము నీదు స్వంత జనమును
    మరువుము నీదు తండ్రి యింటిని

    1. ఈ రాజు నీ ప్రభువు - నీ సొగసు గోరె ఈ రాజు నీ ప్రభువు
    ఈ రాజు నీదు సౌందర్యమును గోరె - ఈ రాజునకు నమస్కరించుము

    2. తూరు దేశ కుమార్తె - నైవేద్యములను తీసికొని వచ్చును
    ప్రజలలో ఇశ్వర్యవంతులు - కుమారి నీ దయను వెదకెదరు

    3. అంతఃపురములో నుండు రాజకుమార్తె - ఎంతో మహిమ గలది
    శృంగారమైనట్టి ఆమె వస్త్రములు - బంగారుబుట్టా పనిచేసినవి

    4. విచిత్ర పనిగల వస్త్రముల ధరించి - విచిత్ర పనిగల
    రాజు నొద్ధకు కన్యకల వలన - రమ్యముగా కొని రాబడుచున్నది

    5. ఉత్సాహ సంతోషముతో - వారు వచ్చు చున్నారు - ఉత్సాహ సంతోషముతో
    రాజనగరిలో ప్రవేశించు చున్నారు - రాబడు చున్నారు కన్యలందరు

    6. నీ తండ్రులకు ప్రతిగా - నీ కుమారులుందురు - నీ తండ్రులకు ప్రతిగా
    ఈ ధరణి యందంతట నీవు వారిని - అధికారులనుగా నియమించెదవు

    7. తరము లన్నిటను నీ - పేరు జ్ఞాపకముండు - కరణి నొనర్చెదవు
    కాన జనములు సర్వకాలము కృతజ్ఞతాస్తుతులు నీకు చెల్లించెదరు


    Language:TELUGU | Album:Zion Songs Telugu | Category :కీర్తనలు | 692 | Write Comment
  • Post new Lyric | See Tips | Latest | Top Views | Songs List | mostviewed | Total Hits: 3034726
  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2017 Waytochurch.com