• waytochurch.com logo
  • Search and download Christian Lyrics
  • Song no:3204

    yehoavaanu sthuthimchuta mmchidhi mahoannathudaa-యెహోవాను స్తుతించుట మంచిది మహోన్నతుడా


    Reference: యెహోవాను స్తుతించుట మంచిది. మహోన్నతుడా, నీ నామమును కీర్తించుట మంచిది. కీర్తన Psalm 92

    పల్లవి: యెహోవాను స్తుతించుట మంచిది మహోన్నతుడా
    నీ నామమును సంకీర్తనము చేయుట మంచిది

    1. ఉదయము నందు నీదు కృపను
    ప్రతిరాత్రిలో నీ - విశ్వాస్యతను
    యెహోవా నిన్ను గూర్చి - ప్రచురించుట మంచిది

    2. పదితంతులు గల - స్వరమండలమున్
    గంభీర ధ్వనిగల - సితారలను
    వాయించి నిన్ను గూర్చి - ప్రచురించుట మంచిది

    3. ఎందుకనగా యెహోవా - నీ కార్యము చేత
    నీవు నన్ను సంతోష-పరచు చున్నావు
    నీ చేతిపనులను బట్టి - నేనుత్సహించుచున్నాను

    4. యెహోవా నీ కార్యము - లెంత మంచివి
    నీ యాలోచన లతి - గంభీరములు
    పశుప్రాయులు అవి-వేకులు వివేచింపరు

    5. నిత్యనాశనము - నొందుటకే గదా
    భక్తిహీనులు గడ్డి - వలె చిగుర్చుదురు
    చెడు కార్యములను - చేయువారు పుష్పింతురు

    6. మహోన్నతుడవుగా - నిత్యముండు యెహోవా
    నీ శత్రువు లెహోవా - నశియించెదరు
    చెడు పనులను చేయు - వారందరు - చెడిపోదురు

    7. నీతిమంతులు తమా-ల వృక్షమువలె
    నాటబడినవారై - యెహోవా మందిరములో
    ఎదుగుచు మొవ్వు వేసి - వర్థిల్లుచు నుండెదరు

    8. నాకు ఆశ్రయమైన - యెహోవా యథార్థుడు
    చెడుగు లేనివాడని - ప్రసిద్ధి చేయుటకు
    సారము కలిగి ప-చ్చగ నుందురు వృద్ధులు


    Language:TELUGU | Album:Zion Songs Telugu | Category :కీర్తనలు | 600 | Write Comment
  • Post new Lyric | See Tips | Latest | Top Views | Songs List | mostviewed | Total Hits: 5007775
  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2018 Waytochurch.com