• waytochurch.com logo
  • Search and download Christian Lyrics
    • Song no:3335

      aaraadhimchedha ninu madhi pogadedha nirathamu ninu sthuthiyimchedhanu-ఆరాధించెద నిను మది పొగడెద నిరతము నిను స్తుతియించెదను


    Reference: ఇల్లు అత్తరు వాసనతో నిండెను. యోహాను John 12:3

    పల్లవి: ఆరాధించెద నిను మది పొగడెద
    నిరతము నిను స్తుతియించెదను
    మార్గము నీవే సత్యము నీవే
    జీవము నీవే నా ప్రభువా

    1. విస్తారంబగు - వ్యాపకములలో - విడచితి నీ సహవాసమును
    సరిదిద్దితివి నా జీవితము - నిను సేవింపగా నేర్పిన ప్రభువా

    2. నా జీవితమున నీ మాటలను - వినుటయే చాలని యెరిగితిని
    నా కన్నీటితో నీ పాదములను - కడుగుట నేర్పిన ఓ నా ప్రభువా

    3. వ్యర్థపరచితిని నా సర్వమును - స్వార్థముతో జీవించితిని
    గుర్తించితిని నీ త్యాగమును - వినయముతో నీ సన్నిధిచేరి

    4. నీరక్తముతో నన్ను కడిగితివి - పరిశుద్ధునిగా జేసితివి
    నీరక్షణకై స్తోత్రము చేయుచు - నిత్యమునిన్ను కొనియాడెదను

    5. దుర్గంధముతో నిండిన నన్ను - దయతో నీవు పిలిచితివి
    ప్రేమతో పరమ విందు నొసంగి - ఆనందింపగ జేసిన ప్రభువా

    6. ప్రియముగ దాచిన అత్తరు భరణి - పగులగొట్టి నిన్ను పూజింతు
    నీ ప్రేమను నే నెనెగ తరమా - నా జీవితమున చాలిన ప్రభువా

    7. పెద్దలు పరిశుద్దులు ఘనదూతలు - నీ సన్నిధిలో నిలచినను
    లెక్కింపగ జాలని జనమందున - ననుగుర్తింతువు నా ప్రియ ప్రభువా


    Language:TELUGU | Album:Zion Songs Telugu | Category :ఆరాధన | 994 | Write Comment
  • Post new Lyric | See Tips | Latest | Top Views | Songs List | mostviewed | Total Hits: 4583598
  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2018 Waytochurch.com