• waytochurch.com logo
  • Search and download Christian Lyrics
  • Song no:3647

    jeevimpachaeyumu nammi praarthimthumu-జీవింపచేయుము నమ్మి ప్రార్థింతుము


    Reference: యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము వర్ధిల్ల చేయుము హబక్కూకు Habakkuk 3:2

    1. సర్వశక్తి యుతుడా - సభకు శిరస్సా
    కొఱతయెక్కువాయెను - త్వరగా కృపనిమ్ము

    పల్లవి: జీవింపచేయుము నమ్మి ప్రార్థింతుము
    వాక్కు నెరవేరువరకు - కాచియుండెదము

    2. ప్రేమతో పిల్చితివి - నన్ను రక్షించితివి
    నీ జీవము నాలో వాడెను - నాదేవా దిగుము

    3. ప్రేమ చల్లారెనే - ఆత్మ కొఱతచే
    శవమువలె నైతిని - నీ చేత నన్నెత్తు

    4. ప్రార్థన వాంఛయు - వాక్యంబు నాసక్తి
    నాలో నూటగా రానిమ్ము - సర్వం సమర్పింతున్

    5. వైరి చెఱ వీడన్ - పోరుపట్టుదలతో
    సల్పి జీవపత్రిక గా - నీచే ప్రకాశింతున్

    6. ఆత్మ పెండ్లికుమారా - నీరాక కొరకై
    నిర్భయముతో వేచియుండ - నానిద్ర పోగొట్టు

    7. హల్లెలూయ పాడను - మరుపులు తొలగును
    శుద్ధాత్మను వెదకును - ఎల్లరకున్ చాటన్


    Language:TELUGU | Album:Zion Songs Telugu | Category :క్రైస్తవ ప్రార్థన | 705 | Write Comment
  • Post new Lyric | See Tips | Latest | Top Views | Songs List | mostviewed | Total Hits: 5007832
  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2018 Waytochurch.com