• waytochurch.com logo
  • Search and download Christian Lyrics
    • krupa kanikaramula maa dhaevaa kruthajnythanarpimthu-కృప కనికరముల మా దేవా కృతజ్ఞతనర్పింతు video
    • Song no:3658

      krupa kanikaramula maa dhaevaa kruthajnythanarpimthu-కృప కనికరముల మా దేవా కృతజ్ఞతనర్పింతు

    Reference: చెప్ప నశక్యము మహిమా యుక్తమునైన సంతోషము 1 పేతురు Peter 1:9

    పల్లవి: కృప కనికరముల - మా దేవా - కృతజ్ఞతనర్పింతు

    1. యెహోవా చేసిన - ఉపకారములకై ఆయన కేమి చెల్లింతును?
    యెహోవా నామమున ప్రార్థన జేసెదను రక్షణ పాత్రచేబూని

    2. యెహోవాకు నా - మ్రొక్కుబడి చెల్లింతు యెహోవా దాసుడను నేను
    యెహోవా ప్రజలలో యెరూషలేములో ఎల్లప్పుడు స్తుతింతు

    3. తల్లి గర్భమున - రూపింపబడక మునుపే నన్ను - ఎరిగితివి
    తల్లి గర్భమునుండి - బయలుపడకముందే ప్రతిష్టించితివి

    4. పూర్ణ మనస్సుతో - నన్ను వెదకిన నన్ను కనుగొందురంటివి
    కరుణతో నీవే - నన్ను వెదకి రక్షించితివి ప్రభువా

    5. దూషకుడను - హింసకుడను హానికరుడనై యుంటిని
    దాసునిగా నన్ను - జేసికొంటివి దోషముల బాపి

    6. ఇది నీకొరకై - విరువబడిన నా శరీరమనియంటివి
    ఇది నీ పాప - క్షమకొరకై చిందిన రక్తమంటివి

    7. నీదు కృపతో - నాదు యేసు నన్ను నీవు - రక్షించితివి
    కాదునాదు - క్రియలవలన ఇది దేవుని వరమే

    8. చెప్పనశక్యము - మహిమా యుక్తము నీవొసంగిన - సంతోషము
    తప్పకుండ హల్లెలూయ పాటపాడెదన్

    Language:TELUGU | Album:Zion Songs Telugu | Category :క్రైస్తవ సాక్ష్యము | 1104 | Write Comment
  • Post new Lyric | See Tips | Latest | Top Views | Songs List | mostviewed | Total Hits: 4624834
  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2018 Waytochurch.com