• Search and download Christian Lyrics
  • Click to Use Keyboard বাঙালি , हिंदी , ಕನ್ನಡ , മലയാളം , தமிழ் , తెలుగు
  • Song no:3725 -

    aanmdhamae manakilaloa mana kaanmdhamae prabhu laechen-ఆనందమే మనకిలలో మన కానందమే ప్రభు లేచెన్

    Click to View in বাঙালি | English | ગુજરાતી | हिंदी | ಕನ್ನಡ | മലയാളം | Oriya | ਪੰਜਾਬੀ | தமிழ் | తెలుగు |


    Reference: ఆయన మృతులలో నుండి లేచియున్నాడు మత్తయి Matthew 28:7

    పల్లవి: ఆనందమే మనకిలలో
    మన కానందమే ప్రభు లేచెన్
    ఆనందమే మనకిలలో

    1. పాపుల మిత్రుడు - పాప రహితుడు
    పాపులకొరకై - శాప గ్రాహియై
    మోపుగ శాపము - వీపున మోసె
    పాపపు ఋణము తీర్చె

    2. పొంతిపిలాతు - మసుఖమునందు
    శాస్త్రుల పెద్దల - యేదుటను నిలిచె
    స్తోత్రార్హుండు - మరణము గెలిచె
    సైతానును ఓడించె

    3. మరణము భయము - లేని వారమై
    మరణమున్ గెల్చిన - యేసుని జేరి
    తరుణమును - పోగొట్టుకొనక
    పరమ ప్రభువును చాటన్

    4. లేచిన ప్రభువు - ప్రియులను జూచి
    గాంచెద నంచు - అభయమునిచ్చె
    తీసివేసెను - చింతయు నంతను
    రోసెద మిపుడే లోకమున్

    5. పరమునకేగి - పంపెనాత్మను
    పరవశులైరి - శిష్యులు గదిలో
    కొరతలేని - శక్తిని పొందిరి
    శిరముల - నెత్తిచాటిరి

    6. మన ప్రభుయేసు - వచ్చుచుండె
    మనము - రెప్ప - పాటున మారి
    తనివి దీరగా - సంతసించి
    వినయుని చేరెదము

    7. మహిమ కిరీట - ధారులమై
    మహిమ వస్త్రములు ధరించి
    మహిమగల - రాజుతో నుండి
    మహిని పాలించెదము


    Language:TELUGU | Album:Zion Songs Telugu | Category :క్రైస్తవ నిరీక్షణ | 385 | Write Comment
  • Post new Lyric | See Tips | Latest | Top Views | Songs List | mostviewed | Total Hits: 2564540
  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2017 Waytochurch.com