• waytochurch.com logo
  • Search and download Christian Lyrics
  • Song no:3739

    prabhuvaa nee paripoornatha numdi pomdhithimi krupavembadi krupanu-ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిమి కృపవెంబడి కృపను


    Reference: నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకుడి. హగ్గయి Haggai 2:5

    పల్లవి: ప్రభువా నీ పరిపూర్ణత నుండి
    పొందితిమి కృపవెంబడి కృపను

    1. ప్రభువైన యేసుక్రీస్తు - పరలోక విషయములో
    ప్రతి ఆశీర్వాదమును - ప్రసాదించితివి మాకు

    2. జనకా నీ వెన్నుకొనిన - జనుల క్షేమముజూచి
    సంతోషించునట్లు - నను జ్ఞాపకముంచుకొనుము

    3. నీదుస్వాస్థ్యమైనట్టి - నీ ప్రజలతో కలిసి
    కొనియాడునట్లుగా - నను జ్ఞాపకముంచుకొనుము

    4. దేవా నీ ప్రజల యెడల - దినదినము నీకున్న
    ఘనుడా నీదు దయతో - నను జ్ఞాపకముంచుకొనుము

    5. దేవా నీదు స్వరూప - దివ్యదర్శనమును
    దినదినము నాకొసగి - నను జ్ఞాపకముంచుకొనుము

    6. మీ మధ్యన నా ఆత్మ - ఉన్నది భయపడకు
    డనిన మహోన్నతుడా - నను జ్ఞాపకముంచుకొనుము

    7. ముదమార నన్నెన్నుకొని - ముద్ర యుంగరముగను
    చేతుననిన ప్రభువా - నను జ్ఞాపకముంచుకొనుము

    8. కృపా సత్య సమ్మిలిత - నంపూర్ణ స్వరూప
    హల్లెలూయ నీకే ప్రభో - ఎల్లప్పుడు కలుగునుగాక


    Language:TELUGU | Album:Zion Songs Telugu | Category :క్రైస్తవ నిరీక్షణ | 809 | Write Comment
  • Post new Lyric | See Tips | Latest | Top Views | Songs List | mostviewed | Total Hits: 5025995
  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2018 Waytochurch.com