sarvoanna thudu sarvaadhikaari sarvashakthimmthudu aayanaeసర్వోన్న తుడు సర్వాధికారి సర్వశక్తిమంతుడు ఆయనే
Reference: మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదము రోమా Romans 8:28పల్లవి: సర్వోన్న - తుడు సర్వాధికారి సర్వశక్తిమంతుడు - ఆయనే సర్వజ్ఞా - నము మనకు నిచ్చున్ - పాడుడల్లెలూయఅను పల్లవి: యధార్థమైనది - దైవమార్గ మిల - సంపూర్ణమైనది నాథుడేసు నీకై - చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు మననాథు డమర్త్యుని మాటనమ్ము మిక - మీదట తెలిసి కొందువు1. ఆశ్చర్యకరుడు యోసేపున్ నెట్టితెచ్చె నైగుప్తునకు - రాజుగాచేసి తన ప్రజల అక్కరన్ తీర్చెపాడు డల్లెలూయ2. ఆలోచనకర్త మోషేను లేపెపాలకుడైన ఫరో నెదిరింపన్బలపరచి తన ప్రజలన్ విడిపించెపాడు డల్లెలూయ3. మహోన్నతుడు దానియేలున్ గాచెమహాబాబెలునందు ఆయనేమహారాజుగా మహిమ నొందెనుపాడు డల్లెలూయ4. బలవంతుడేసు పేతురున్ గాచిపౌలును బట్టి తెచ్చి సంఘమున్కల్తీలేకుండ కట్టె సత్యాత్మతోపాడు డల్లెలూయ5. ఆది అంతము లేని మన యేసునాథుడు వచ్చుచున్నా డిదిగోసిద్ధముగా నుండి సుస్వాగత మిమ్ముఆమెన్ హల్లెలూయా