• Search and download Christian Lyrics
  • Song no:4037 -

    aathma niyamamu dhvaaraa saagi poavudhamu-ఆత్మ నియమము ద్వారా సాగి పోవుదము

    Click to View in বাঙালি | English | ગુજરાતી | हिंदी | ಕನ್ನಡ | മലയാളം | Oriya | ਪੰਜਾਬੀ | தமிழ் | తెలుగు |


    Reference: విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు ... పరుగెత్తుదము హెబ్రీ Hebrews 12:12

    పల్లవి: ఆత్మ నియమము ద్వారా - సాగి పోవుదము
    విశ్వాసమునకు కర్తయు దానిని
    కొనసాగించు యేసుని జూచుచు
    ఓపికతో మనము సాగి పోవుదము

    1. భక్తి హీనులకు నీతిని జాటుచు - జల ప్రళయమున
    ఓడలో జేరిన - నోవహువలె మనము సాగి పోవుదము

    2. సిద్ధపరచిన పురమును - జేర వాగ్దానములను
    నమ్మి నడిచిన అబ్రహాము వలె - సాగి పోవుదము

    3. ఘోరమైనయా జారత్వమునకు - దూరముగాను
    పారిపోయిన - యోసేపుని బోలి సాగి పోవుదము

    4. దేవుని ప్రజలతో శ్రమయే మేలని - ఐగుప్తు పాపపు
    భోగము విడిచిన మోషేవలె మనము సాగి పోవుదము

    5. పరిశుద్ధాత్మతో నిండిన వాడై - దైర్యముగా వాక్యమును
    బోధించిన పేతురు వలె మనము సాగి పోవుదము

    6. పోరు సహించి సువార్త పక్షమున - పరుగు ముగించి
    పానార్పణమైన - భక్త పౌలు వలే సాగి పోవుదము

    7. తేటగ దైవ సంకల్పము దెల్పుచు - రాళ్ళను రువ్వగ
    ప్రాణము విడిచిన - స్తెఫనువలె మనము సాగి పోవుదము


    Language:TELUGU | Album:Zion Songs Telugu | 466 | Write Comment
  • Post new Lyric | See Tips | Latest | Top Views | Lyrics List | mostviewed | Total Hits: 1727020

© 2017 Waytochurch.com