• waytochurch.com logo
  • Search and download Christian Lyrics
  • Song no:4043

    paraloakamae naa svaasthyamu epudu gaamthunoa-పరలోకమే నా స్వాస్థ్యము ఎపుడు గాంతునో


    Reference: ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు గలతీ. 2:20

    పల్లవి: పరలోకమే నా స్వాస్థ్యము - ఎపుడు గాంతునో
    నా ప్రియ యేసుని - నేనెపుడు గాంతునో

    1. ఆకలిదప్పులు దుఃఖము - మనోవేదన లేదచ్చట
    పరమ మకుటము పొందను - ప్రభు పాదముల చేరెదను

    2. సిలువ వేయబడితిని - ఇక నేకాదు జీవించుట
    ప్రభు యేసు మహిమ కొరకు - గురి గలిగి జీవింతును

    3. నా పరుగు తుదముట్టింప - నాకు కృపను మెండుగ నొసగును
    విశ్వాస మార్గములో - విసుగక పరుగెత్తెదను

    4. పరమ విశ్రాంతి పొంద - పరలోకమందు చేరెదను
    పగలు రాత్రచ్చట లేదు - ప్రభువే దీపమై యుండును

    5. ప్రియుని పిలుపును విని - నేను కూడా సిద్ధపడెదను
    దినములు సమీపించగా - వాంఛయు అధికంబాయె


    Language:TELUGU | Album:Zion Songs Telugu | 818 | Write Comment
  • Post new Lyric | See Tips | Latest | Top Views | Songs List | mostviewed | Total Hits: 5007779
  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2018 Waytochurch.com