• waytochurch.com logo
  • Search and download Christian Lyrics
  • Song no:4054

    yaesu prabhuvae loakarakshkudu vaerevvaru laeru paapulaina manala rakshimp-యేసు ప్రభువే లోకరక్షకుడు వేరెవ్వరు లేరు పాపులైన మనల రక్షింప


    Reference: యీయన నిజముగా లోక రక్షకుడు యోహాను John 4:42

    పల్లవి: యేసు ప్రభువే లోకరక్షకుడు
    వేరెవ్వరు లేరు - పాపులైన మనల రక్షింప (2)

    1. లోక సృష్టికర్త పాపము బాప
    నరునిగ భువికి - అరుదెంచే ఆ.. ఆ.. ఆ.. (2)
    పాపిని రక్షింప - సిలువలో మరణించే (2)
    ప్రేమతో నిన్ను విడిపింప వేరెవ్వరు లేరు
    జీవాధిపతి - యేసుడే (2)

    2. గ్రుడ్డికి చూపునిచ్చి - కుంటివారిన్
    చక్కగ నడువ జేసెను ఆ.. ఆ.. ఆ..
    మూగ వారిని మాట్లాడగ జేసెను
    చెవిటి వారి వినజేసెన్ వేరెవ్వరుకాదు
    సర్వాధికారి - యేసుడే

    3. కుష్టరోగుల నెల్ల - శుద్ధుల జేసి
    ఇష్టపడి స్వస్థత నిచ్చెన్ ఆ.. ఆ.. ఆ..
    చనిపోయిన వారిని - సజీవులుగ జేసెన్
    కష్టము లేకుండా జేసెన్ - వేరెవ్వరు కాదు
    జీవాధిపతి - యేసుడే

    4. నేనే మార్గం, సత్యం, జీవం అనెను
    వేరొక మార్గం లేదనెన్ ఆ.. ఆ.. ఆ..
    సాతాను తలను చితుక ద్రొక్కెను
    మరణించి తిరిగి చేచెను - నిను పరమున చేర్చ
    ప్రభు యేసే నీకు మార్గము - వేరెవ్వరు లేరు
    ప్రభు యేసే నీకు మార్గము


    Language:TELUGU | Album:Zion Songs Telugu | 877 | Write Comment
  • Post new Lyric | See Tips | Latest | Top Views | Songs List | mostviewed | Total Hits: 5025728
  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2018 Waytochurch.com