• waytochurch.com logo
  • Search and download Christian Lyrics
  • Song no:4055

    sthuthiyimthumu yaesu prabhuvaa maa sthuthiki paathrudaa-స్తుతియింతుము యేసు ప్రభువా మా స్తుతికి పాత్రుడా


    Reference: ఇదిగో త్వరగా వచ్చుచున్నాను ప్రకటన Revelation 22:12

    పల్లవి: స్తుతియింతుము యేసు ప్రభువా (2) - మా స్తుతికి పాత్రుడా (2)
    నిత్యం నిన్నే ఆరాధించి (2) - మహిమ పరతుము ఇలలో (2)
    స్తుతికి పాత్రుడా (2)

    1. మా పాపములు మమ్ము నీకు - బహుదూరంబు జేయగా
    ఏ పాపమెరుగని ప్రభువా - మాకై సిలువలో బలియైతివా
    నీ రక్తముతో మమ్ము కడిగి - నీ చెంతకు చేర్చితివా

    2. లోకాశకు లొంగిపోయి - నీ సహవాసమును వీడగ
    ఆకాశమును వీడి మాకై - నీతో సహవాస మొసగితివా
    పరిశుద్ధులుగా మమ్ము తీర్చి - పరమ స్వాస్థ్యము నిచ్చితివా

    3. సాతానుకు దాసులమై - నిత్య మార్గమును వీడగ
    పతనమైన మా బ్రతుకుల్ - నిత్య జీవముగా మార్చితివా
    నిత్యము నిన్నే సేవింప - సత్యవాక్యము నొసగితివా

    4. నిరీక్షణ లేక మేము - నిర్భాగ్యులమై యుండగా
    త్వరగా రానై యున్న ప్రభువా - పరమ నిరీక్షణ నిచ్చితివా
    నీ రాకకై ఎదురు చూడ - సిద్ధపాటును నొసగితివా


    Language:TELUGU | Album:Zion Songs Telugu | 856 | Write Comment
  • Post new Lyric | See Tips | Latest | Top Views | Songs List | mostviewed | Total Hits: 5025672
  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2018 Waytochurch.com