• waytochurch.com logo
  • Search and download Christian Lyrics
  • Song no:4056

    thana raajyamunaku mahimaku pilachina mana prabhuvuku thaginattu nadichedhamu-తన రాజ్యమునకు మహిమకు పిలచిన మన ప్రభువుకు తగినట్టు నడిచెదము


    Reference: తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనుడి 1 థెస్స Thessalonians 2:11

    పల్లవి: తన రాజ్యమునకు మహిమకు పిలచిన - 2
    మన ప్రభువుకు తగినట్టు నడిచెదము
    తన రాజ్యములో మనము చేరెదము

    1. కారుచీకటి కమ్మినను - యేసుని వెలుగులో నడిచెదము - 2
    మంచి కాపరి మనతోనుండగ - తనతో ముందుకే సాగెదము - 2

    2. ఇరుకు మార్గపు ఇబ్బందులలో - సిలువను మోయుచు వెళ్ళెదము
    యేసే మనదు భారము మోయుచు - మనకు మార్గము చూపును

    3. ఉప్పొంగుచున్న ఉపద్రవములలో - ఉన్నవాడనని ప్రభువనెను
    అంతము వరకు చెంత నిలిచి - తానే మనతో నడచును

    4. దారితొలగక గురి యొద్దకే - యేసునే చూచి నడచెదము
    ఇహమున శుద్ధులై నడచువారే - పరమున ప్రభువుతో సంచరించెదరు

    5. విశ్వాసమును విడువక - మంచి పోరాటం పోరాడి
    ప్రభువుతో నడచి పరుగు ముగించి - నీతి కిరీటము పొందెదము


    Language:TELUGU | Album:Zion Songs Telugu | 615 | Write Comment
  • Post new Lyric | See Tips | Latest | Top Views | Songs List | mostviewed | Total Hits: 5026423
  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2018 Waytochurch.com