aa jali premanu ఆ జాలి ప్రేమను గమనింపకుందువా
ఆ జాలి ప్రేమను గమనింపకుందువా? ఆ దివ్య ప్రేమను గ్రహియింపకుందువా? ఓ సోదరా. . . ఓ సోదరా . . . ఆ ప్రేమమూర్తి యేసు దరిచేరవా? 1. నీ పాప జీవితాన ఆ ప్రేమమూర్తియే ఆ సిల్వపైన నీకై మరణ బాధ నొందెను నీ శిక్ష బాపగా రక్షణను చూపగా ని హృదయ ద్వారమందు వేచియుండెగా నీ రక్షకుండు యేసు నిన్ను పలచుచుండెను ఆ ప్రేమమూర్తి పలుకు ఆలకింపజాలవా? 2. ఎంత పాపినైనా గాని యేసు చేర రమ్మనె యేసు చెంత చేరువాని త్రోసివేయజాలడు నీ పాప జీవితం ప్రభుయేసు మార్చగా నీ చెంత చేరి నిన్ను పిలచుచుండెను విలువైన రక్త ధార ప్రేమతోడ గార్చెను ఆ ప్రేమ మూర్తి పిలుపు ఆలకింపజాలవా?