gaganame murisenu గగనమే మురిసెను
గగనమే మురిసెను
తారయే మెరిసెను
పరమున దూతలే
పండుగ జేసెను
జయం జయం
హోసన్నా జయం జయం
శుభం శుభం
లోకానికి శుభం శుభం
ఇమ్మానుయేలుగా
యేసే మనకు తోడుగా
ఇలను జన్మించెగా
భయము లేదుగా
అందకారమైన
పొంగే సంద్రమైన
నిన్ను విడువలేడు
యేసే నీకు తోడు
అల్పమైన దానను
అనుకున్న బెత్లెహేమా
లోకాలనేలేటోడు
నిను కోరెను
నీలోనే జన్మించెను
నీ పేరు మారుమ్రోగెను
తన ప్రేమను కురిపించెను
బ్రతుకంత పండుగ చేసెను