lali jo naa chinni thandri paraloka raajaa నా చిన్ని తండ్రి పరలోక రాజా
నా చిన్ని తండ్రి పరలోక రాజా
బాలయేసుగా
పవలించితివి పశుల పాకలో
నీదు జననము మానవాళికి
ఎంతో పరవశము
నీదు జననము లోకానికి
ఎంతో శుభోదయం
నీదు జననము మాకు
ఇల రక్షణకు శ్రీకారము
లాలీ జో లాలీ జో
దూత సమూహముల స్తోత్రగానములు
ఇల లేవు నీకు నేను పాడే కీర్తనలు తప్ప
అందుకో నా పేద హృదయపు లాలి పాట
లోక రక్షణకు ఇల విమోచనకు
ఈ పృథ్వి పావనమైనది
నీ స్పర్శ సోకగనే
నీ చిన్ని నవ్వులే నాకు చాలు
మాకు ఈ బ్రతుకంతా