vimthagala maa yaesu praemanu వింతగల మా యేసు ప్రేమను సంతసమున
Chords: ragam: బిలహరి-bilahari
వింతగల మా యేసు ప్రేమను సంతసమున స్తుతింతును పంతముగఁ
దన ప్రాణమును పా పులకు నియ్యను వచ్చి సిలువను జచ్చి నను రక్షించె
నహహా ||వింత||
1. ప్రీతిగల మా ప్రభుని కృప బహు ప్రియముతోఁ జాటింతును సాధుగా
నాకొఱకు సిలువను చాల శ్రమల భరించి చావు జ యించి నను రక్షించె
నహహా ||వింత||
2. పాడుఁడీ మా యేసు ప్రేమను వేఁడుఁడీ మదిఁ గూడుఁడీ పాడుఁడీ
తన దివ్యరక్తము పాప క్రయముగ నిచ్చి శాపముఁ బాపి నను రక్షించె
నహహా ||వింత||
3. నిత్య జీవము నిండు నెమ్మది నిరతముగ నాకియ్యను రక్తస్వేదము
గార్చె నహహా నరక శాపముఁ ద్రుంచి యాపద నుంచి నను రక్షించె
నహహా ||వింత||