chudumu gesthemane చూడుము గెత్సెమనె తోటలో నా ప్రియుడు
పల్లవి: చూడుము గెత్సెమనె - తోటలో నా ప్రియుడు పాపి నాకై విజ్ఞాపన చేసెడి - ధ్వని వినబడుచున్నది 1. దేహమంతయు నలిగి - శోకము నొందినవాడై దేవాది దేవుని ఏకసుతుడు పడు - వేదనలు నా కొరకే ...చూడుము... 2. తండ్రి యీ పాత్ర తొలగన్ - నీ చిత్తమైన యెడల ఎట్లయినను నీ చిత్తము చేయుటకు - నన్నప్పగించితివనెను ...చూడుము... 3. రక్తపు చెమట వలన - మిక్కిలి బాధనొంది రక్షకుడేసు హృదయము పగులగ - విజ్ఞాపనము జేసెనే ...చూడుము... 4. ముమ్మారు భూమి మీద - పడి మిక్కిలి వేదనచే - మన యేసు ప్రభువు తానే వేడుకొనెను - పాపుల విమోచన కొరకే ...చూడుము... 5. ప్రేమతో కూడిన వాక్కులచే - ఆదరించెడి ప్రభువు వేదన సమయమున ఆదరించువారు - లేక బాధనొందెను ...చూడుము... 6. నన్ను తన వలె మార్చెడి - ఈ మహా ప్రేమను తలచి తలచి హృదయము కరుగగా - నే సదా కీర్తించెదను