deva mahonnathuda దేవా మహోన్నతుడా మహిమా ప్రకాశితుడా
పల్లవి: దేవా మహోన్నతుడా మహిమా ప్రకాశితుడా పది వేలలో అతి సుందరుడా కీర్తింతు మనసారా (2X) ..దేవా.. 1. వెలిశావు భువిలో మెస్సయ్యగా - ఎడారి బ్రతుకులో సెలయేరుగా (2X) నిస్సారమైనా నా జీవితములో చిగురించె ఆనందము ..దేవా.. 2. వెదికాను నీ దరి ఒంటరినై - నిలిచాను నీ దరి అన్వేసినై (2X) నీ దివ్య మార్గం చూపించినా ఫలియించె నా జన్మము