దేవా నీ యావరణం మాకెంతో శ్రేయస్కరం
deva nee yavaranam
పల్లవి: దేవా నీ యావరణం మాకెంతో శ్రేయస్కరం ఒక ఘడియ యిచ్చట గడుపుట మేలు వేయిదినములకంటెను (2X) ..దేవా.. 1. అద్భుత కార్యములు ఆ.. జరిగించు దేవుడవు ఆ.. ఘనవారసకుని మహిమలు పొగడ ఆత్మలో నిలుపుమయా ఆత్మతొ సత్యముతో ఆరాధించగ మనస్సుతో అల్ఫా ఒమేఘయు ఆత్మరూపుడవు ఆనందించగ నీ మదిలో ...దేవా... 2. పరిశుద్ధ సన్నీధిలొ ఆ.. పరిశుద్ధాత్ముని నీడలొ ఆ.. పరిపూర్ణ హృదయముతో పరివర్తనముతో ప్రభునే ప్రస్తుతించెదం మా దేహమే ఆలయం - కావాలి మీకే నిలయం ప్రాణప్రియుడవు - పదముల జేరి ప్రాణార్పణము జేతును ...దేవా... 3. అత్యంత పరిశుద్ధమౌ ఆ.. నీదు గుడారమున ఆ.. నివసించుటకు యోగ్యత నొసగి మమ్ము హెచ్చించితివి నీ దయన్ జుంటిధారల కన్నను - తేనే మధురిమలకన్నను శ్రేష్టమౌ నీదు వాక్కుల చేత - మమ్ము తృప్తీ పరచుము ...దేవా...