deva samsthuthi cheyave manasaదేవ సంస్తుతి చేయవే మనసా శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి
పల్లవి: దేవ సంస్తుతి చేయవే మనసా - శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా - దేవ సంస్తుతి చేయుమా నా - జీవమా యెహోవా దేవుని - పావన నామము స్తుతించుమా - నా యంతరంగము - లో వసించు - నో సమస్తమా - ఆ కారణముచే ...దేవ... 1. జీవమా యెహోవా నీకు - జేసినా మేళ్ళన్ మరువకు నీవు చేసిన పాతకంబులను మన్నించి జబ్బు - లేవియున్ లేకుండ జేయును - ఆ కారణముచే ...దేవ... 2. చావు గోతి నుండి నిన్ను - లేవనెత్తి దయను కృపను జీవ కీరీటముగ వేయును - నీ శిరసు మీద - జీవ కీరీటముగ వేయును - ఆ కారణముచే ...దేవ... 3. యౌవనంబు పక్షిరాజు - యౌవనంబు వలెనే క్రొత్త యౌవనంబై వెలయునట్లుగ - మేలిచ్చి నీదు - భావమును సంతుష్టి పరచునుగా - ఆ కారణముచే ...దేవ... 4. ప్రభువు నీతి పనులు చేయున్ - బాధితులకు న్యాయమిచ్చున్ విభుడు మార్గము తెలిపె మోషేకు - దన కార్యములను విప్పె నిశ్రాయేలు జనమునకు - ఆ కారణముచే ...దేవ... 5. అత్యధిక ప్రేమ స్వరూపి - యైన దీర్ఘశాంత పరుడు నిత్యము వ్యాజ్యంబు చేయడు - ఆ కృపోన్నతుడు నీపై నెపుడు కోపముంచడు - ఆ కారణముచే ...దేవ... 6. పామరులమని ప్రత్యుపకార - ప్రతిఫలంబుల్ పంపలేదు భూమి కన్న నాకసంబున్న - యెత్తుండు దైవ - ప్రేమ భక్త జనులయందున - ఆ కారణముచే ...దేవ... 7. పడమటికి తూర్పెంత యెడమో - పాపములకున్ మనకు నంత యెడము కలుగ జేసి యున్నాడు - మన పాపములను యెడముగానే చేసియున్నాడు - ఆ కారణముచే ...దేవ... 8. కొడుకులపై తండ్రి జాలి - పడు విధముగా భక్తి పరుల యెడల జాలి - పడును దేవుండు - తన భక్తి పరుల - యెడల జాలి పడును దేవుండు- ఆ కారణముచే ...దేవ... 9. మనము నిర్మితమయిన రీతి - తనకు దెలిసియున్న సంగతి మనము మంటి వారమంచును - జ్ఞాపకము చేసి - కొనుచు కరుణ జూపుచుండును - ఆ కారణముచే ...దేవ... 10. పూసి గాలి వీవ నెరిగి - పోయి బసను దెలియని వన - వాస పుష్పము వలెనె నరుడుండు - నరు నాయువు తృణ - ప్రాయము మన దేవకృప మెండు - ఆ కారణముచే ...దేవ... 11. పరమ దేవ నిబంధ నాజ్ఞల్ - భక్తితో గైకొను జనులకు నిరతమును కృప నిలిచి యుండును - యెహోవా నీతి తరముల పిల్లలకు నుండును - ఆ కారణముచే