dhevuni upakarambulalona దేవుని ఉపకారంబులలోన దేనిని మరువకుము
పల్లవి: దేవుని ఉపకారంబులలోన - దేనిని మరువకుము ఆయన చేసిన మేలులన్నియు - అనుదినమును ధ్యానించుము 1. నిరాశతో మనమున్నప్పుడు - నిరసించిపడియున్నప్పుడు (2X) మరణ చాయలో నున్నప్పుడు - మరువకుండ కాపాడెనుగా ...దేవుని... 2. వ్యాధులలో మనమున్నప్పుడు - బాధలలో మనమున్నప్పుడు (2X) వ్యాధుల బాధల తొలగించి - ఆదరించి కాపాడెనుగా ...దేవుని... 3. మహోపకారములన్నియును -యెహోవ దేవుడె చేసెనుగా (2X) అహోరాత్రులు ధ్యానించి - మహోన్నతుని స్తుతియించుము