dhevuni yandhu nireekshana దేవుని యందు నిరీక్షణనుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా
పల్లవి: దేవుని యందు నిరీక్షణనుంచి - ఆయనను స్తుతించు నా ప్రాణమా 1. ఏ అపాయము రాకుండ నిన్ను - దివారాత్రులు కాపాడువాడు (2X) ప్రతిక్షణం నీపక్షముండు - రక్షకుడు ...దేవుని... 2. చీకటిని వెలుగుగా చేసి - ఆయనే నీముందు పోవువాడు (2X) సత్యమగు - జీవమగు - మార్గ - మేసె ...దేవుని... 3. తల్లి తన బిడ్డను మరచినను - మరువడు నీ దేవుడు నిన్ను (2X) తల్లి కన్నా - తండ్రి కన్నా - ఉత్తముడు ...దేవుని... 4. నీకు సహాయము చేయువాడు - సదా ఆదుకొనువాడు ఆయనే (2X) ఆధారము - ఆదరణ - ఆయనలో ...దేవుని... 5. నీకు విరోధముగా రుపించిన - ఏవిధ ఆయుధమును వర్ధిల్లదు (2X) శత్రువులు - మిత్రులుగా - మారెదరు ...దేవుని... 6. పర్వతములు తొలగిపోయినను - తన కృప నిన్ను ఎన్నడు వీడదు (2X) కనికర - సంపన్నుడు - నాదేవుడు ...దేవుని... 7. స్తుతి మహిమలు నీకే ప్రభు - నిత్యము నిన్నే కొనియాడెద (2X) హల్లేలూయ - హల్లేలూయ - హల్లేలూయ ...దేవుని...