dhootha paata paadudi దూత పాట పాడుడి రక్షకున్ స్తుతించుడి ఆ ప్రభుండు
1. దూత పాట పాడుడి రక్షకున్ స్తుతించుడి - ఆ ప్రభుండు బెత్లెహేము నందునన్ - భూజనంబు కెల్లను సౌఖ్య సంభ్రమాయెను - ఆకసంబు నందున మ్రోగు పాట చాటుడి - దూత పాట పాడుడి రక్షకున్ స్తుతించుడి 2. ఊర్ధ్వ లోకమందున గొల్వగాను శద్దులు - అంత్య కాలమందున కన్య గర్భమందున - బుట్టినట్టి రక్షకా ఓ యిమ్మానియేల్ ప్రభో - ఓ నరవతారుడా నిన్ను నెన్న శక్యమా? - దూత పాట పాడుడి రక్షకున్ స్తుతించుడి 3. రావె నీతి సూర్యడా రావె దేవపుత్రుడా - నీదు రాకవల్లను లోక సౌఖ్యమాయెను - భూనివాసులందరు మృత్యుభీతి గెల్తురు - నిన్ను నమ్ము వారికి ఆత్మశుద్ది కల్గును - దూత పాట పాడుడి రక్షకున్ స్తుతించుడి