• waytochurch.com logo
Song # 12420

kristhuni goorchi meeku emi క్రీస్తుని గూర్చి మీకు ఏమి తోచుచున్నది


క్రీస్తుని గూర్చి మీకు ఏమి తోచుచున్నది
పరుడని నరుడని భ్రమ పడకండి (2)
దేవుని కుమారుడు
ఈయనే దేవుని కుమారుడు

1.ఈయన నా ప్రియ కుమారుడు
ఈయన యందే ఆనందము
తండ్రియే పలికెను తనయుని గూర్చి
మీ కేమితోచు చున్నది ||క్రీస్తు||

2.రక్షకుడనుచు అక్షయుని చాటిరి
దూతలు గొల్లలకు
ఈ శుభవార్త వినియున్నట్టి
మీకేమీ తోచు చున్నది ||క్రీస్తు||

3.మర్మము నెరిగిన మహనీయుడు
మరుగై యండక పోవునని
సమరయ స్త్రీయే సాక్షమీయ్యగా
మీకేమితోచుచున్నది ||క్రీస్తు||

4.నీవు దేవుని పరిశుదుడవు మా జోలికి
రావద్దనియు
దయ్యములే గుర్తించి చాటగా-
మీకేమి తోచుచున్నది ||క్రీస్తు||

5.నిజముగ ఈయన దేవుని
కుమారుడేయని సైనికుల
శతాధిపతియే సాక్షమియ్యగ
మీకేమి తోచుచున్నది ||క్రీస్తు||


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com