• waytochurch.com logo
Song # 12423

idhi rakshana krupa kaalam ఇది రక్షణ కృపకాలం


ఇది రక్షణ కృపకాలం
ప్రభు త్వరగా రా సమయం
ఇక ఆలస్యం లేదిక
మనస్సు మార్చుకోనీవిక (2)

1.రాజ్యముల రాజ్యముల్
జనములపై జనములు
ఎటుచూచిన మరణముల్
ఎటుకేగిన యుద్దముల్ ||ఇది||

2.దేశమంతా క్షామమే
జగమంతా అశాంతియే
శ్రమకాలం మొదలాయే
యుగసమాప్తి సమీపించే ||ఇది||

3.అంత్య క్రీస్తుపాలన-
అతి శీఘ్రమే రానుండే
విశ్వాసులకు నిందలు
భక్తులకు హింసలు||ఇది||

4.క్రైస్తవుడా మేలుకో
సోదరుడా స్థిరపడు
నిర్లక్ష్యముగా నుండకు
ఆత్మయందే బలపడు ||ఇది||


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com