rakshimpabadina neevu lokaashalapaine needu రక్షింపబడిన నీవు – లోకాశలపైనే నీదు
రక్షింపబడిన నీవు – లోకాశలపైనే నీదుగురి నిలిపి పయనిస్తున్నావారక్షకుని ఎరిగిన నీవు – తానెవరో తెలియదు నాకుఅన్నట్టు జీవిస్తున్నావా (2)యేసే లేని నీ బ్రతుకులోవెలుగే లేదు అది తెలుసుకోయేసే లేని నీ జీవితానికివిలువే లేదు అది తెలుసుకో (2) ||రక్షింపబడిన||మంటితోనే నిను చేసినాకంటి పాపగా కాపాడెనేమాటి మాటికి పడిపోయినాశాశ్వత ప్రేమతో ప్రేమించెనే (2)ఆ ప్రేమను కాదని – అవసరమే లేదనిఈ లోకం నాదని – ప్రభు మార్గం విడచితివాయేసే లేనిచో – పరలోకానికిప్రవేశం లేదనే – పరమార్ధం మరచితివా ||యేసే||యేసులోనే నీ రక్షణయేసులోనే నిరీక్షణయేసులోనే క్షమాపణచేసుకో మరి ప్రక్షాళన (2)ఎంతో ప్రేమను – నీపై చూపించెనుతన ప్రాణము సైతము – నీకై అర్పించెనుగాఇప్పటికైననూ – మార్చుకో మనస్సునూప్రభువును చేరగా – వేగిరమే పరుగిడిరా ||యేసే||