విలువైన నీ కృప నాపై చూపి – కాచావు గత కాలము
Viluvaina Nee Krupa Naapai Choopi Kaachaavu Gatha Kaalamu
విలువైన నీ కృప నాపై చూపి – కాచావు గత కాలము
ఎనలేని నీ కృప నాపై ఉంచి – ఇచ్చావు ఈ వత్సరం
దినములు సంవత్సరాలు గడచిపోయెను ఎన్నో
ప్రతి దినము ప్రతి క్షణము కాపాడినావు నీ దయలో
నా జీవిత కాలమంతా నను నడుపుము యేసయ్యా
నిను పాడి స్తుతియించి ఘనపరతును నేనయ్యా (2) ||విలువైన||
గడచినా కాలమంతా తోడైయున్నావు
అద్భుతాలు ఎన్నో చేసి చూపావు (2)
లెక్కించ లేని మేలులతో తృప్తి పరిచావు (2)
నీ కరుణా కటాక్షములు నాపై ఉంచావు (2) ||నా జీవిత||
సంవత్సరాలు ఎన్నో జరుగుచుండగా
నూతన కార్యాలు ఎన్నో చేశావు (2)
సంవత్సరమను నీ దయా కిరీటం ధరింప చేశావు (2)
నా దినములు పొడిగించి నీ కృపలో దాచావు
మా దినములు పొడిగించి నీ కృపలో దాచావు ||నా జీవిత||
viluvaina nee krupa naapai choopi – kaachaavu gatha kaalamu
enaleni nee krupa naapai unchi – ichchaavu ee vathsaram
dinamulu samvathsaraalu gadachipoyenu enno
prathi dinamu prathi kshanamu kaapaadinaavu nee dayalo
naa jeevitha kaalamanthaa nanu nadupumu yesayyaa
ninu paadi sthuthiyinchi ghanaparathunu nenayyaa (2) ||viluvaina||
gadachina kaalamanthaa thodaiyunnaavu
adbhuthamulu enno chesi choopaavu (2)
lekkinchaleni melulatho thrupthiparichaavu (2)
nee karunaa kataakshamulu naapai unchaavu (2) ||naa jeevitha||
samvathsaraalu enno jaruguchundagaa
noothana kaaryaalu enno chesaavu (2)
samvathsaramanu nee dayaa kireetam dharimpa chesaavu (2)
naa dinamulu podiginchi nee krupalo daachaavu
maa dinamulu podiginchi nee krupalo daachaavu ||naa jeevitha||