• waytochurch.com logo
  • Song - 12451 : Parishuddhudavai Mahima Prabhaavamulaku Neeve Paathrudavu పరిశుద్ధుడవై – మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు Lyrics

  • Quick search
  • పరిశుద్ధుడవై – మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు
    బలవంతుడవై – దీనుల పక్షమై కృప చూపు వాడవు (2)
    దయాళుడవై – ధారాళముగా నను దీవించిన శ్రీమంతుడా
    ఆరాధన నీకే నా యేసయ్యా
    స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా (2) ||పరిశుద్ధుడవై||

    నీ స్వాస్థ్యమైన నీ వారితో కలిసి నిను సేవించుటకు
    నీ మహిమ ప్రభావమును కిరీటముగా ధరింపజేసితివి (2)
    శాశ్వత కాలము వరకు నీ సంతతిపై దృష్టి నిలిపి
    నీ దాసుల ప్రార్ధనలు సఫలము చేసితివి ||ఆరాధన||

    నీ నిత్యమైన ఆదరణ చూపి నను స్థిరపరచుటకు
    నీ కరుణా కటాక్షమును నాపై కురిపించి నను ప్రేమించితివి (2)
    నాకు ప్రయోజనము కలుగజేయుటకు నీ ఉపదేశమును బోధించి
    నీ దాసుని ప్రాణమును సంతోషపరచితివి ||ఆరాధన||

    ఆనందకరమైన దేశములో నేను నిను ఘనపరచుటకు
    నీ మహిమాత్మతో నింపి సురక్షితముగా నన్ను నివసింపజేసితివి (2)
    మేఘ వాహనుడవై వచ్చుఁవరకు నే కనిపెట్టుచుందును నీ కోసము
    నీ దాసుల కాంక్షను సంపూర్ణ పరచెదవు ||ఆరాధన||

    Language:Telugu | 498 | Write Comment
  • Post new Lyric | See Tips | Latest | Top Views | Songs List | mostviewed | Total Hits: 5768841
  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2018 Waytochurch.com