Parishuddhudavai Mahima Prabhaavamulaku Neeve Paathrudavu పరిశుద్ధుడవై – మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు
పరిశుద్ధుడవై – మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవుబలవంతుడవై – దీనుల పక్షమై కృప చూపు వాడవు (2)దయాళుడవై – ధారాళముగా నను దీవించిన శ్రీమంతుడాఆరాధన నీకే నా యేసయ్యాస్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా (2) ||పరిశుద్ధుడవై||నీ స్వాస్థ్యమైన నీ వారితో కలిసి నిను సేవించుటకునీ మహిమ ప్రభావమును కిరీటముగా ధరింపజేసితివి (2)శాశ్వత కాలము వరకు నీ సంతతిపై దృష్టి నిలిపినీ దాసుల ప్రార్ధనలు సఫలము చేసితివి ||ఆరాధన||నీ నిత్యమైన ఆదరణ చూపి నను స్థిరపరచుటకునీ కరుణా కటాక్షమును నాపై కురిపించి నను ప్రేమించితివి (2)నాకు ప్రయోజనము కలుగజేయుటకు నీ ఉపదేశమును బోధించినీ దాసుని ప్రాణమును సంతోషపరచితివి ||ఆరాధన||ఆనందకరమైన దేశములో నేను నిను ఘనపరచుటకునీ మహిమాత్మతో నింపి సురక్షితముగా నన్ను నివసింపజేసితివి (2)మేఘ వాహనుడవై వచ్చుఁవరకు నే కనిపెట్టుచుందును నీ కోసమునీ దాసుల కాంక్షను సంపూర్ణ పరచెదవు ||ఆరాధన||
parishuddhudavai – mahima prabhaavamulaku neeve paathrudavubalavanthudavai – deenula pakshamai krupa choopu vaadavu (2)dayaaludavai – dhaaraalamugaa nanu deevinchina shreemanthudaaaaraadhana neeke naa yesayyaasthuthi aaraadhana neeke naa yesayyaa (2) ||parishuddhudavai||nee swaasthyamaina nee vaaritho kalisi ninu sevinchutakunee mahima prabhaavamunu kireetamugaa dharimpajesithivi (2)shaashwatha kaalamu varaku nee santhathipai drushti nilipinee daasula praardhanalu saphalamu chesithivi ||aaraadhana||nee nithyamaina aadarana choopi nanu sthiraparachutakunee karunaa kataakshamunu naapai kuripinchi nanu preminchithivi (2)naaku prayojanamu kalugajeyutaku nee upadeshamunu bodhinchinee daasuni praanamunu santhoshaparachithivi ||aaraadhana||aanandakaramaina deshamulo nenu ninu ghanaparachutakunee mahimaathmatho nimpi surakshithamuga nannu nivasimpajesithivi (2)megha vaahanudavai vachchuvaraku ne kanipettuchundunu nee kosamunee daasula kaankshanu sampoorna parachedavu ||aaraadhana||