• waytochurch.com logo
  • Song - 12468 : Naa Jeevitha Vyadhalandu నా జీవిత వ్యధలందు యేసే జవాబు Lyrics

  • Quick search
  • నా జీవిత వ్యధలందు యేసే జవాబు
    యేసే జవాబు – ప్రభు యేసే జవాబు (2) ||నా జీవిత||

    తీరని మమతలతో ఆరని మంటలలో
    ఆశ నిరాశలతో తూలెను నా బ్రతుకే (2)
    నను గని వచ్చెను – తన కృప నిచ్చెను
    కరుణతో ప్రేమించి – కలుషము బాపెను ||నా జీవిత||

    చీకటి వీధులలో నీటుగా నడచితిని
    లోకపు ఉచ్ఛులలో శోకము జూచితిని (2)
    నను గని వచ్చెను – తన కృప నిచ్చెను
    కరుణతో ప్రేమించి – కలుషము బాపెను ||నా జీవిత||

    హంగుల వేషముతో రంగుల వలయములో
    నింగికి నేనెగిరి నేలను రాలితిని (2)
    నను గని వచ్చెను – తన కృప నిచ్చెను
    కరుణతో ప్రేమించి – కలుషము బాపెను ||నా జీవిత||

    Language:Telugu | 881 | Write Comment
  • Post new Lyric | See Tips | Latest | Top Views | Songs List | mostviewed | Total Hits: 5823441
  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2018 Waytochurch.com