• waytochurch.com logo
Song # 125

idhigo dheva naa jeevitham ఇదిగో దేవా నా జీవితం ఆపాద మస్తకం నీకంకితం


పల్లవి:
ఇదిగో దేవా నా జీవితం - ఆపాద మస్తకం నీకంకితం

శరణం నీ చరణం - శరణం నీ చరణం (2X)
...ఇదిగో...

1.
పలుమార్లు వైదొలగినాను - పరలోక దర్శనము నుండి

విలువైన నీ దివ్య పిలుపుకు - తగినట్లు జీవించనైతి (2X)

అయినా నీ ప్రేమతో - నన్ను దరి చేర్చినావు

అందుకే గైకొనుమో దేవా - ఈ నా శేష జీవితం
...ఇదిగో...

2.
నీ పాదముల చెంతచేరి - నీ చిత్తంబు నేనెరుగ నేర్పు

నీ హృదయ భారంబు నొసగి - ప్రార్దించి పనిచేయ నేర్పు (2X)

ఆగిపోక సాగిపోవు - ప్రియసుతునిగ పని చేయనిమ్ము

ప్రతిచోట నీ సాక్షిగా - ప్రభువా నన్నుండనిమ్ము
...ఇదిగో...

2.
విస్తార పంట పొలము నుండి - కష్టించి పనిచేయనిమ్ము

కన్నీటితో విత్తు మనస్సు - కలకాలం మరినాకు నొసగు (2X)

క్షేమక్షామ కాలమైనా - నిన్ను ఘనపరచు బ్రతుకు నిమ్మయా

నశియించు ఆత్మలన్ - నీదరి చేర్చు కృపనిమ్మయా
...ఇదిగో...


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com