• waytochurch.com logo
  • Song - 12506 : Sundharamaina Dehaalenno Shithilam Kaaledhaa సుందరమైన దేహాలెన్నో శిధిలం కాలేదా? Lyrics

  • Quick search
  • సుందరమైన దేహాలెన్నో శిధిలం కాలేదా?
    అంబరమంటిన రాజులెందరో అలిసిపోలేదా?
    కలములు పట్టిన కవులు ఎందరో కనుమరుగవలేదా?
    ధరణిలోన ధనికులెల్లరు దహనం కాలేదా?
    ఏదీ శాశ్వతం కాదేది శాశ్వతం
    తరచి చూడుము పరికించి చూడము (2) ||సుందరమైన||

    నెత్తుటి చారలను లిఖించిన రాజులెందరో
    ఆ నెత్తురులోనే ప్రాణాలు విడిచిపోయారు
    అధికార దాహంతో మదమెక్కిన వీరులు
    సమాధి లోతుల్లోనే మూగబోయారు (2)
    తపోబలము పొందిన ఋషులందరూ
    మతాధికారులు మఠాధిపతులు
    ఈ కాలగర్భంలోనే కలసిపోయారు
    మరణ పిడికళ్లలో బందీలయ్యారు (2)
    యేసులేని జీవితం వాడబారిన చరితం (2)
    క్రీస్తు ఉన్న జీవితం భువిలో చరితార్ధం (2) ||సుందరమైన||

    ప్రాణం పోసిన దైవాన్ని కాదంటే
    ఆ జీవితానికి పరమార్ధం ఉంటుందా?
    పాప సంకెళ్ళలో బందీలైనవారికి
    ఆ దివ్య మోక్షం చేరుకొనే భాగ్యం ఉంటుందా? (2)
    శరీరాన్ని విడిచిన మనుష్యాత్మకు
    మరో జీవితం లేదనుట భావ్యమా?
    రక్తము కార్చిన యేసుని విస్మరించి
    ఈ సృష్టిని పూజించుట మనిషికి న్యాయమా? (2)
    యేసులేని జీవితం అంధకార భందురం (2)
    క్రీస్తు ఉన్న జీవితం తేజోమయ మందిరం (2) ||సుందరమైన||

    Language:Telugu | 312 | Write Comment
  • Post new Lyric | See Tips | Latest | Top Views | Songs List | mostviewed | Total Hits: 5507083
  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2018 Waytochurch.com